Kaantha | దక్షిణాదిలో స్టార్ హీరోలు రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ సంయుక్తంగా స్పిరిట్ మీడియా, వేఫారర్ ఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మించిన పిరియాడిక్ డ్రామా కాంత ఓటీటీలోకి వచ్చేసింది.ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా, నేటి నుంచి ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో అప్పుడు థియేటర్స్‌లో మిస్ అయ్యినవారు ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీలో చూడొచ్చు. తమిళ సినిమా దిగ్గజాలు ఎంకే త్యాగరాజ భాగవతార్, ఎంజీఆర్, ఎంఆర్ రాధాల జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని రూపొందిన ఈ చిత్రంలో దుల్కర్, సముద్రఖని, భాగ్యశ్రీ భోర్సే, రానా దగ్గుబాటి, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించారు.
డానీ సాంచేజ్ లోపేజ్ సినిమాటోగ్రఫీ, జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, జాను చాంతర్ సంగీతం, లీవెలీన్ ఆంథోని – గోన్సాల్వేజ్ ఎడిటింగ్ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఇక ఈ సినిమాకి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. నవంబర్ 14న తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ప్రభావం చూపలేదు. సుమారు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి మిశ్రమ సమీక్షలు రావడంతో కలెక్షన్లు దెబ్బతిన్నాయి. దుల్కర్ మరియు భాగ్యశ్రీ భోర్సే నటనకు మంచి ప్రశంసలు వచ్చినప్పటికీ మొత్తం సినిమా వసూళ్లు పరిమితమయ్యాయి. తమిళంలో 16 కోట్లు, తెలుగులో 7 కోట్లు వసూలవగా, ఇండియాలో మొత్తం 27 కోట్ల గ్రాస్, 23 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది.
ఓవర్సీస్లో 8.5 కోట్ల రూపాయల వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 35.5 కోట్ల గ్రాస్‌తో థియేట్రికల్ రన్‌ను ముగించింది. థియేటర్లలో నిరాశపరిచిన కాంత ఇప్పుడు ఓటీటీలో అదృష్టాన్ని పరీక్షించుకోడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి, అంటే సుమారుగా 40 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. ముందస్తు ఒప్పందం ప్రకారం డిసెంబర్ 12వ తేదీ నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండే కాంత ఓటీటీలో ప్రేక్షకుల మన్ననలు పొందుతుందో లేదో చూడాలి.