సాగర్, వికాస్, అభిలాష్, రోహిత్, రవితేజ, హరి, శతి శంకర్, విహారిక చౌదరి, ఉమ, హాన్విక, పల్లవి రేష్మ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న సినిమా ‘కాలం రాసిన కథలు’. ఎస్.ఎం.4 ఫిల్మ్స్ పతాకంపై నిర్మించిన చిత్రమిది. ఫ్యామిలీ, లవ్, సస్పెన్స్ జోనర్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం టీజర్ రిలీజ్ వేడుక హైదరాబాద్లో బుధవారం జరిగింది.
ముఖ్య అతిథిగా విచ్చేసిన పీపుల్స్ మీడియా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీధర్ మాట్లాడుతూ.. ‘మనం ప్రతి ఒక్కరి జీవితంలోనూ కాలం కొన్ని కథలు రాస్తుంది. దాన్ని బట్టే మన జర్నీ ఉంటుంది. దర్శకుడు సాగర్ గారు ఇంత మంచి కాన్సెప్ట్ ఎన్నుకోవడంతోనే సగం విజయం సాధించారు’ అన్నారు. ‘గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ ప్రేమకథలో ఫ్యామిలీ ఎమోషన్స్, సస్పెన్స్, భక్తి మిళితమై ఉంటాయి’ అని చిత్ర రచయిత, దర్శక, నిర్మాత ఎం.ఎన్.వి.సాగర్ చెప్పారు. ఈ సినిమాకు కెమెరా: ఎస్.ప్రసాద్, సంగీతం: మేరుగు అరమాన్.