K Ramp Onam Full Song | టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరోసారి తన సత్తా చాటుకున్నారు. విభిన్నమైన కథలు, రియలిస్టిక్ ఎమోషన్స్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఆయన తాజా చిత్రం ‘కే ర్యాంప్ (K Ramp)’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. కొత్త కాన్సెప్ట్, ఎనర్జిటిక్ ప్రెజెంటేషన్, రిచ్ టెక్నికల్ వర్క్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అన్ని ఏరియాల్లో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. యువ దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కించిన ఈ సినిమా యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్ల మేళవింపుగా సాగింది. కిరణ్ అబ్బవరం ఎనర్జీతో కూడిన నటన, యుక్తి తారేజ్ గ్లామర్, నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్ తదితరుల ప్రెజెన్స్ సినిమాకు మరింత బలం చేకూర్చింది.
‘కే ర్యాంప్’ కథ ఫ్యాషన్, కాంపిటీషన్, యూత్ డ్రీమ్స్ చుట్టూ తిరుగుతుండటం సినిమాకు తాజాదనాన్ని తీసుకువచ్చింది.హాస్య మూవీస్, రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండా, బాలాజీ గుత్తా, శివాజీ బొమ్మక్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సుమారు రూ. 4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. విజువల్స్, మ్యూజిక్, ఎడిటింగ్ – అన్ని విభాగాల్లోనూ సినిమా రిచ్ లుక్‌తో ఆకట్టుకుంది.రిలీజ్‌కి ముందు నుంచే బజ్ సృష్టించిన ‘కే ర్యాంప్’ థియేట్రికల్ బిజినెస్ రూ. 8 కోట్లకు పైగా జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ. 9 కోట్ల షేర్ (సుమారు రూ. 18 కోట్ల గ్రాస్) సాధించాల్సి ఉంది.నిర్మాతల ప్రకారం, సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ. 17.5 కోట్ల గ్రాస్ సాధించి బ్రేక్ ఈవెన్ చేరుకుంది. వారం రోజుల్లో రూ. 28 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ సాధించింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, సినిమా కనీసం రూ. 12–14 కోట్ల లాభం అందుకుంది.
కిరణ్ అబ్బవరం- యుక్తి తరేజా జంటగా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ కే- ర్యాంప్ ఈ నెల 18న విడుదలైంది . సక్సెస్ ఫుల్ గా మొదటి వారం థియేట్రికల్ రన్ పూర్తిచేసుకొని.. ఇటీవలే రెండో వారంలోకి అడుగుపెట్టింది. అయితే తాజాగా ఈ మూవీలోని ‘ఓనమ్’ ఫుల్ సాంగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. కాలేజీలో ‘ఓనమ్’ వేడుకల నేపథ్యంలో సాగే ఈ పాట చాలా కలర్ ఫుల్ గా ఉండగా, ఇందులో కిరణ్, యుక్తి కాస్ట్యూమ్స్, డాన్స్ స్టెప్పులు అలరించాయి. ఈ పాటపై మీరు ఓ లుక్కేయండి.