‘ఈ దీపావళికి ప్రేక్షకులు మళ్లీ నాకు బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చారు. ఈ పండుగకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించడంతో పాటు చిన్న సందేశాన్ని ఇవ్వాలనే లక్ష్యంతో ఈ సినిమా చేశాం’ అన్నారు కిరణ్ అబ్బవరం. ఆయన కథానాయకుడిగా జైన్స్ నాని దర్శకత్వంలో రూపొందిన ‘కె-ర్యాంప్’ చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా సాయంత్రం సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సినిమాకు తాము ఊహించిన దానికంటే అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నదని కిరణ్ అబ్బవరం తెలిపారు. ఈ సినిమాలో లాజిక్స్ వెతక్కూడదని, ప్రేక్షకులను నవ్వించడం కోసమే ఈ సినిమా తీశామని, అయినా కొందరు ఉద్దేశ్యపూర్వకంగా తమ చిత్రంపై పక్షపాతం చూపిస్తున్నారని చిత్ర నిర్మాత రాజేష్ దండా అన్నారు. ఈ సినిమాలో వినోదంతో పాటు సెకండాఫ్‌లో వచ్చే సెంటిమెంట్ అందరినీ ఆకట్టుకుంటున్నదని దర్శకుడు జైన్స్ నాని పేర్కొన్నారు. ప్రేక్షకుల్ని నవ్వించడం కోసం తాము చేసిన ప్రయత్నం సక్సెస్ అయిందని సీనియర్ నటుడు వీకే నరేష్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.