K Ramp Movie | దీపావళి పండుగ కానుకగా విడుదలైన కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’ (KRamp) చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుని దూసుకుపోతున్న ఈ చిత్రం తాజాగా రూ.40 కోట్ల క్లబ్లో చేరినట్లు చిత్రబృందం ప్రకటించింది. తొలిసారిగా మెగా ఫోన్ పట్టిన డెబ్యూ డైరెక్టర్ జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యువతరం ఈ చిత్రాన్ని చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. చిత్ర విజయం పట్ల సోషల్ మీడియాలో కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తూ, ఈ విజయాన్ని ఉత్సవంలా జరుపుకుంటున్నారు. ఈ సినిమాలో యూక్తి తరేజా కథానాయికగా నటించగా.. రాజేశ్ దండా ఈ సినిమాను నిర్మించాడు. సాయి కుమార్, నరేష్ కీలక పాత్రలో నటించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కుమార్ (కిరణ్ అబ్బవరం) పుట్టుకతోనే సంపన్నుడు. తండ్రి కృష్ణ (సాయికుమార్) అతి గారబంతో సర్వం సమకూర్చుతాడు. కానీ కుమార్ కి చదువు పట్టదు. పైగా ఎప్పుడూ డ్రింక్ చేస్తూ ఉంటాడు. తనని దారిలో పెట్టాలని కేరళలోని ఓ కాలేజ్ లో చేర్చుతారు. అక్కడ మెర్సీ జాయ్ (యుక్తి తరేజా)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు కుమార్. అయితే మెర్సీకి ఓ మానసిక సమస్య వుంటుంది. ఆ సమస్య ఏమిటి? దానికి కారణంగా ఈ ప్రేమకథ ఎలాంటి మలుపు తిరిగిందనేది మిగతా కథ.