K- Ramp | టాలీవుడ్లో హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న హీరో కిరణ్ అబ్బవరం. రాజావారు రాణిగారు సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయిన ఈ కుర్ర హీరో మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తరువాత ఏడాదికి నాలుగైదు సినిమాలు రిలీజ్ చేయడం మొదలుపెట్టాడు. అయితే కిరణ్ సినిమాల్లో కొత్తదనం లేదని ప్రేక్షకులు పలు విమర్శలు చేశారు. దాంతో తాను చేసిన తప్పేంటో తెలుసుకున్న కిరణ్ ఒక ఏడాది గ్యాప్ తీసుకొని.. లుక్, కథ అన్ని మార్చి క(KA) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో కిరణ్ వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే K- ర్యాంప్ సినిమా సెట్స్ మీద ఉండగా.. ఇటీవల మరో సినిమాను ప్రకటించాడు. . రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ కథను అందిస్తున్నాడు. SKN ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు చెన్నై లవ్ స్టోరీ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇందులో గౌరీ ప్రియ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఒక చిన్న గ్లింప్స్ విడుదల కాగా, ఆ గ్లింప్స్ తోనే మణిశర్మ సినిమాపై అంచనాలు పెంచాడు.
ఇక ఈ రోజు కిరణ్ అబ్బవరం బర్త్ డే సందర్భంగా కె ర్యాంప్ సినిమాకి సంబంధించి గ్లింప్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇందులో కిరణ్ బాడీ లాంగ్వేజ్, స్టైల్ చూస్తుంటే మూవీ మంచి హిట్ సాధించడం ఖాయం అంటున్నారు. గ్లింప్స్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. చేతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. కిరణ్ అబ్బవరం, చేతన్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం ఇది. గతంలో వీరి కాంబో ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రాలు వచ్చాయి. ఇక KRamp చిత్రం అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ మధ్య ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా, ఇందులో కిరణ్ అబ్బవరం లుంగీ కట్టుకుని చాలా సింపుల్ లుక్లో కనిపించాడు. ఇక ఈ చిత్రంలో ఎంటర్టైన్మెంట్కు ఎలాంటి కొదువ లేదని మేకర్స్ అంటున్నారు. చిత్రంలో అందాల భామ యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తుండగా జెయిన్స్ నాని డైరెక్ట్ చేస్తున్నారు.