Thandel Movie Review | అక్కినేని హీరో, నటుడు నాగ చైతన్య కెరీర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం తండేల్ (Thandel). కార్తికేయ 1,2 సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించాడు. సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.
అయితే తాజాగా ఈ సినిమా చూసిన టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు సినిమాపై ప్రశంసలు కురిపించారు. చాలా రోజులకు తండేల్ వంటి అద్భుతమైన ప్రేమకథ చూసాను. నాగ చైతన్య, సాయి పల్లవి పోటీ పడి నటించారు. చందు మొండేటి తీసుకున్న కథ దాని నేపధ్యం సాహసోపేతమే. షాట్ మేకింగ్ పై దర్శకుడు పెట్టిన శ్రద్ద బాగుంది. ఈ చిత్రంతో సక్సెస్ గీత ఆర్ట్స్ వారికి అభినందనలు. ఒక్క మాటలో ఇది ఒక దర్శకుడి సినిమా..! అంటూ రాఘవేంద్రరావు రాసుకోచ్చాడు. అయితే రాఘవేంద్రరావు ప్రశంసలపై చైతూ స్పందిస్తూ.. ‘మీ నుంచి ప్రశంసలు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. థాంక్యూ సో మచ్ సర్’ అంటూ చైతూ తెలిపాడు.
తండేల్ కథ విషయానికి వస్తే.. ఉత్తరాంధ్రకు చెందిన రాజు (నాగ చైతన్య) అతడి బృందంతో బతుకుదెరువు కోసం గుజరాత్‌లోని వీరవల్‌కు చేపల వేటకు వెళతాడు. సముద్రవేట చేస్తూ.. బోర్డర్ దాటి పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కుతాడు రాజు. దీంతో అతడిని పాకిస్థాన్‌కి తీసుకువెళ్లిన అనంతరం జరిగిన పరిణమాలు ఏంటి.. పాకిస్థాన్ జైలు నుంచి అతడు ఎలా బయటపడ్డాడు అనేది స్టోరీ. ఇక ఇందులోనే కొంచెం ప్రేమ కథ, దేశభక్తి అంశాలు జోడించి కమర్షియల్‌గా తెరకెక్కించారు మేకర్స్.