Actress Jyothika Identity Crisis | ప్రముఖ నటి జ్యోతిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగుతో పాటు తమిళం హిందీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో మాస్, ఠాగూర్, షాక్ వంటి సినిమాల్లో నటించి సూపర్ హిట్లు అందుకుంది. తమిళ హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భామ ఆ తర్వాత చెన్నైకి షిప్ట్ అయ్యింది. అయితే దాదాపు 26 ఏండ్ల తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జ్యోతిక. ఇప్పటికే రాజ్ కుమార్ రావు నటించిన శ్రీకాంత్ సినిమాతో పాటు షైతాన్ సినిమాలో హీరోయిన్గా నటించి ప్రశంసలు అందుకుంది. ఇక ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా వెబ్ సిరీస్ ‘డబ్బా కార్టెల్()’ ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 28 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటుంది జ్యోతిక. తాజాగా ఒక ప్రమోషన్లో మాట్లాడుతూ.. తాను కూడా లింగ వివక్షను ఎదుర్కొన్నట్లు తెలిపింది.
లింగ వివక్ష(Casual sexism) అనేది ప్రస్తుతం రోజువారిలో జరిగే ఒక విషయంగా మారిపోయింది. నేను సూర్యను పెళ్లి చేసుకున్నా కూడా సమాజంలో ఇప్పటికి లింగ వివక్షను ఫేస్ చేస్తూనే ఉన్న. నేను ఎప్పుడైన ఇంటర్వ్యూలలో సూర్యని పెళ్ళి చేసుకున్నందుకు అదృష్టవంతురాలిని అని చెబితే.. ప్రజలు సూర్య చాలా మంచి వాడు అంటారు. అదే విషయంలో సూర్య నన్ను పెళ్లి చేసుకుని అతడు సంతోషంగా ఉన్నాడని చెబితే.. సూర్య ఎంత మంచి వాడు భార్య గురించి ఇంతలా ఆలోచిస్తున్నాడు అంటారు. ఇందులో నేను ఎక్కడ కనిపించను. ఎందుకంటే సమాజం అలా చిత్రీకరిస్తుంది.
చివరికి వస్తువుల విషయంలో కూడా మేము లింగ వివక్షను ఎదుర్కొంటాం. నేను ఒక కారు లేదా ఇంకా ఏదైన వస్తువు కొన్నప్పటికి దాని ఫీచర్లు చూడాల్సింది వేరొకరు అనే ధోరణి ఉంది. ఎందుకంటే ఆడవాళ్లు బాగా నిర్ణయాలు తీసుకోలేరు అనే చిన్నచూపు ఉంటుంది. కొన్నిసార్లు అయితే ఇది మా గుర్తింపుకి కూడా సంక్షోభం కలిగించే స్థాయికి చేరుకుంటుందని ఆమె పంచుకుంది.