Jyothika| సినీ నటి జ్యోతిక టాలీవుడ్ ప్రేక్షకులకి చాలా సుపరిచితం. ఆమె తెలుగులో పలు సినిమాలు చేసి మెప్పించింది. తమిళ నటుడు సూర్యని వివాహం చేసుకున్న తర్వాత కాస్త సినిమాలు తగ్గించింది. అయితే ఈ మధ్య మళ్లీ సినిమాలు మొదలు పెట్టింది. కంటెంట్ ఉన్న చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తుంది. అయితే తాజాగా జ్యోతిక తన భర్తని సపోర్ట్ చేస్తూ సౌత్ సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. వివరాలలోకి వెళితే స్టార్ హీరో సూర్య చివరిగా నటించిన సినిమా కంగువ ఎన్నో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సూర్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించాడు.
అయితే 350 కోట్లకు పైగా ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల వసూళ్లను కూడా రాబట్టలేక బాక్సాఫీస్ దగ్గర చతికిల పడింది. ఇందులో సౌండ్ ఎక్కువగా ఉందనే విమర్శలు వచ్చాయి. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, దిశా పఠానీ, బాబీ డియోల్, కోవై సరళ, యోగి బాబు, రెడ్టిన్ కింగ్స్లీ, నటరాజన్ సుబ్రమణియన్, జగపతి బాబు, కెఎస్ రవికుమార్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు..ఈ చిత్రాన్ని 10కి పైగా భాషల్లో 3డి టెక్నాలజీలో చిత్రీకరించి భారీ ఎత్తునే రిలీజ్ చేశారు. అయితే కంగువ సినిమాకు నెగిటివ్ రివ్యూలు రాయడం వల్లే ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిందని నటి , సూర్య సతీమణి జ్యోతిక తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది.
కంగువ అద్భుతమైన సినిమా , ఆ చిత్రాన్ని థియేటర్లలోనే చూడాలి.తొలి అరగంట మాత్రం బాగాలేదని, అది తాను కూడా ఒప్పుకుంటానంది. ఇందులో యాక్షన్ సీన్స్, సెకండాఫ్ విజువల్స్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారని జ్యోతిక పేర్కొంది. తొలి రోజే మూవీపై అంత నెగటివిటీ చూసి బాధ అనిపించింది. కావాలనే సూర్య సినిమాను తొక్కెస్తున్నారంటూ తన అభిప్రాయన్ని తెలిపింది. సౌత్ నుండి వచ్చిన కొన్ని సినిమాలు ఏమాత్రం బాగోవు. కానీ అవి కమర్షియల్‌గా బాగా హిట్ అవుతాయి. వాటికి మంచి రివ్యూలు ఇస్తుంటారు. కానీ నా భర్త(సూర్య) సినిమా విషయానికి వస్తే మాత్రం చాలా కఠినంగా వ్యవహరించినట్టు అనిపించింది. మూవీ కోసం అందరు ఎంతో కష్టపడ్డారు. అయితన కంగువా సినిమా విషయంలో రివ్యూలు మాత్రం దారుణంగా రాశారు. ఏమాత్రం విచక్షణ లేకుండా రివ్యూలు రాయడం నాకు బాధగా అనిపించింది అని జ్యోతిక తెలియజేసింది.