ఒక్కోసారి అంతే కేవలం ఒక పోస్టర్ చూస్తే సినిమా స్టోరీ చెప్పొచ్చు..అలా చెప్పగలుగుతున్నాము అంటే దర్శకుడి విజన్ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్ (Jeethu Joseph)అందరికంటే ముందు ఉంటాడు. ఒక పోస్టర్ కాదు కేవలం ఒక టీజర్ తోనే తన సినిమా ఎలా ఉండబోతుందో అందరికీ విజువల్ ట్రీట్ ఇచ్చాడు జీతూ జోసెఫ్. తాజాగా ఆయన తెరకెక్కించిన దృశ్యం 2 (Drishyam 2)నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదల కానుంది. వెంకటేష్ (Venkatesh), మీనా (Meena)జంటగా నటించిన ఈ సినిమాలో నదియా, నరేష్ కీలక పాత్రలో కనిపించారు.
2014లో వచ్చిన దృశ్యం సినిమాకు ఇది సీక్వెల్. మొదటి భాగంలో ఒక హత్య చేసిన కుటుంబాన్ని కాపాడడానికి.. ఒక మామూలు మిడిల్ క్లాస్ కేబుల్ ఆపరేటర్ అయిన రాంబాబు ఏం చేశాడు అనేది కథ. ఇప్పుడు ఆ కేసు మళ్లీ పోలీసులు తిరగతోడడంతో మరోసారి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి రాంబాబు ఏం చేసాడు అనేది ఇప్పటి కథ. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మలయాళంలో సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో తెలుగులో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు.
ఇదిలా ఉంటే తాజాగా దృశ్యం 2 నుంచి వెంకటేష్ పోస్టర్ ఒకటి విడుదల అయింది. అది చూసిన తర్వాత దర్శకుడిగా సినిమాపై ఉన్న విజన్ ఏంటో అర్థమవుతుంది. తన హీరోలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఒక పోస్టర్ తో చూపించాడు జీతూ. వెంకటేష్ కళ్లు ఒక చిన్న డీటెయిల్ కూడా మిస్ చేయదు. ఆయన తల ఎప్పుడూ ఒత్తిడిని జయిస్తూ ఉంటుంది. ఇక నోరు ఎప్పుడు అద్భుతమైన కట్టు కథలు చెబుతూ ఉంటుంది.
చేతులు తన కుటుంబాన్ని కాపాడడం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఆయన గుండె ఎప్పుడూ సినిమాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాళ్లు ఎంతో భారాన్ని మోస్తూ ఉంటాయి. ఇలా ప్రతి ఒక సింగిల్ డీటెయిల్ పోస్టర్ లో చూపించాడు చేశాడు దర్శకుడు జీతూ జోసెఫ్. సినిమా థియేటర్లలో విడుదల కాకపోయినా కూడా ప్రమోషన్ మాత్రం ఓ రేంజ్లో చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Thaman AKhanda Update | అఖండపై థమన్ ఇచ్చిన క్రేజీ అప్ డేట్ ఎంటో తెలుసా..?
Pooja Kannan Debut Film | సాయిపల్లవి సోదరి సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది
Akhanda Musical Roar | అఖండ ‘గర్జన’ కేక..టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో
TJ Gnanavel Apology | క్షమాపణలు చెప్పిన జైభీమ్ డైరెక్టర్..!