స్టార హీరోల భార్యలు సోషల్ మీడియాలో సందడి చేయడం టాలీవుడ్ కు కొత్త కాదు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన, అల్లు అర్జున్ భార్య స్నేహా, నాని భార్య అంజన వీళ్లంతా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. పంచుకోవాల్సిన తమ కుటుంబ విషయాలు ఉంటే తమ ఖాతాలో పోస్ట్ చేస్తారు. ఈ పోస్టులు అభిమానులను బాగా ఆకర్షిస్తాయి. ఈ క్రమంలో ఇన్నాళ్లూ సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి తాజాగా ట్విట్టర్ ఖాతా ప్రారంభించింది.
ట్విట్టర్ లో మీతో జాయిన్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది. నా ప్రియమైన భర్త ఫొటోను మీతో పంచుకుంటున్నాను. అని ఫస్ట్ పోస్ట్ చేసింది. ఎన్టీఆర్ సాధారణంగా తన కుటుంబాన్ని సెలబ్రిటీ లైఫ్ కు దూరంగా ఉంచుతాడు. పర్సనల్ విషయాలపై మాట్లాడడు. లక్ష్మీ ప్రణతి సోషల్ మీడియా అరంగేట్రం వల్ల ఎన్టీఆర్ ఫ్యామిలీ లైఫ్ లోని గ్లింప్స్ తెలుస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ విడుదలకు సిద్ధంగా ఉంది.