Jr Ntr Six Pack | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్ కథనాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో తారక్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి మేకర్స్ నేడు ట్రైలర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్లో ఎన్టీఆర్ చాలా రోజుల తర్వాత మళ్లీ సిక్స్ ప్యాక్‌లో కనిపించాడు. ట్రైలర్ ఫస్ట్ షాటే ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌తో కనిపించడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. చివరిగా తారక్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీరరాఘవా చిత్రంలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించాడు. అయితే దాదాపు ఏడేండ్ల తర్వాత తారక్ మళ్లీ సిక్స్ ప్యాక్‌తో వస్తుండటంతో బాలీవుడ్‌కి ఎంట్రీకి సరైన ఎంపిక అని ఈ లుక్ సినిమాకు మరింత ప్లస్ అవుతుందని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.