Jr.Ntr | జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. తారక్ తన భార్య, పిల్లలతో కలిసి హాలీడేకు అమెరికా వెళ్ళాడు. కాగా తాజాగా ఆయన తన భార్య లక్ష్మీ ప్రణతిని హగ్ చేసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తారక్ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సరే తన ఫ్యామిలీతో కలిసి సమయం గడుపుతుంటాడు. ప్రస్తుతం తారక్ ఫ్యామిలీ అమెరికాలో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తారక్.. ప్రస్తుతం అదే జోష్‌తో కొరటాల శివ సినిమాకు ముస్తాబవుతున్నాడు. అండర్ వాటర్ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబోలో రెండో సినిమా తెరకెక్కనుండటంతో ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని యవసుధ ఆర్ట్స్‌తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్‌రామ్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించనున్నట్లు టాక్.