Jr.NTR Latest Pic | నందమూరి లెగసీని క్యారీ చేస్తున్న వారిలో జూ.ఎన్టీఆర్ ఒకడు. తాతకు తగ్గ మనవడిగా ఇండస్ట్రీలో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు. 20ఏళ్లకే ఇండస్ట్రీ హిట్ సాధించిన తారక్.. ఒక దశలో వరుస ఫ్లాపులను ఎదుర్కొన్నాడు. మళ్లీ ‘టెంపర్’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చి.. ఆ తర్వాత ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక ‘ఆర్ఆర్ఆర్’తో ఏకంగా హాలీవుడ్ ప్రముఖులతోనే చప్పట్లు కొట్టించుకున్నాడు. ప్రస్తుతం తారక్ ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు తారక్ అభిమానులు ఊగిపొతున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకులు ముందుకు రానుంది.
ఇక తారక్ స్క్రీన్‌పైనే కాదు బయట కూడా చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంటాడు. ఆయన వేసే కాస్ట్యూమ్స్ , డ్రెస్సింగ్ స్టైల్, హేయిర్ స్టైల్ ఇలా ప్రతిదాంట్లో ది బెస్ట్ అనిపిస్తుంటాడు. ఇక ఆస్కార్ ప్రమోషన్లలో ఆయన స్టైల్ చూసి హాలీవుడ్ వాళ్లే ఆశ్చర్యపోయారు. కాగా తాజాగా తారక్‌కు సంబంధించిన ఓ ఉబర్ కూల్ లుక్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ప్రముఖ హేయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకిమ్, తారక్‌కు హేయిర్ కట్ చేసిన తర్వాత ఆయనతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో తారక్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో ఉన్నాడు. దీనిపై పలువురు నెటిజన్లు కూల్ లుక్, టైగర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక తారక్ ప్రస్తుతం చేస్తున్న దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్స్ట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు సగం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఎట్టిపరిస్థితుల్లో ఈ ఏడాదిలోపు షూటింగ్ పూర్తి చేసుకుని ఆపై నెల, రెండు నెలలు పోస్ట్ ప్రొడక్షన్స్ జరపాలని చిత్రబృందం ప్లాన్ చేస్తుంది. ఇక ఆచార్యతో కోలుకోలేని దెబ్బతిన్న కొరటాల శివ దేవరతో ఎలాగైనా గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్నాడు. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్న ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది.
Had an amazing time yesterday doing hair for our Man Of Masses 👑 @tarak9999 🔥🔥🔥
🎥It is always fun shooting with @jrntr .. I love his high-octane and positive energy 💥🔥❤️#NTRJr#manofmassesntr #ntrjr #actor #indianfimindustry #star #superstar #aalimhakim #hakimsaalim pic.twitter.com/QI0qlhTMuO
— Aalim Hakim (@AalimHakim) August 9, 2023