యాక్షన్ మోడ్‌లో ఎన్టీఆర్
ప్రశాంత్ నీల్ సినిమా కోసం తారక్ బాగా స్లిమ్ అయ్యారు. ఆ మధ్య ఓ యాడ్ ఫిల్మ్‌లో చిక్కిన ఎన్టీఆర్‌ని చూసి అభిమానులు కాస్త ఇబ్బందిగా ఫీలయ్యారు. అయితే.. ఆ పాత్ర కోసం తారక్ అలా మేకోవర్ కావాల్సివచ్చిందని చిత్రబృందం చెబుతున్నది.
ప్రశాంత్ నీల్ సినిమా కోసం తారక్ బాగా స్లిమ్ అయ్యారు. ఆ మధ్య ఓ యాడ్ ఫిల్మ్‌లో చిక్కిన ఎన్టీఆర్‌ని చూసి అభిమానులు కాస్త ఇబ్బందిగా ఫీలయ్యారు. అయితే.. ఆ పాత్ర కోసం తారక్ అలా మేకోవర్ కావాల్సివచ్చిందని చిత్రబృందం చెబుతున్నది. ఈ సినిమా తాజా షెడ్యూల్ జోర్దాన్‌లో మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌పోర్ట్‌లో హడావిడిగా వెళ్తున్న తారక్ ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అయ్యాయి.
ఆ ఫొటోల్లో గడ్డం పెంచి, మంచి షార్ప్ ఫిజిక్‌తో, మునుపటి మీద స్టైలిష్‌గా, అందంగా కనిపిస్తున్న తమ అభిమాన హీరోను చూసి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇదిలావుంటే.. ఆదివారం నుంచి జోర్దాన్‌లో కొత్త షెడ్యూల్ మొదలైంది.
ఈ ఇంటర్నేషనల్ షెడ్యూల్లో మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్‌ని తెరకెక్కిస్తారు. ఈ ఎపిసోడ్స్ కథలో కీలకంగా ఉంటాయని తెలుస్తున్నది. ఎన్టీఆర్ కెరీర్లోనే దీన్ని అత్యుత్తమ చిత్రంగా నిలిపేందుకు ప్రశాంత్‌నీల్ అహరహం శ్రమిస్తున్నారని తెలిసింది. మైత్రీ మూవీమేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్న విషయం విదితమే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

