Jr Ntr | యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలి కాలంలో నిత్యం వార్తలలో నిలుస్తున్నాడు. దేవర సినిమా కోసం జపాన్ వెళ్లిన జూనియర్ అక్కడ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ వారితో సరదాగా గడిపాడు. ఇటీవల బాలీవుడ్ చిత్రం వార్ 2 షూటింగ్ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది. అయితే తాజాగా ఎన్టీఆర్ మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్‌కి హాజరు అయ్యారు. హైదరాబాద్ లోని శిల్పాకళా వేదికలో మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది చిత్రయూనిట్. ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ మ్యాడ్ స్క్వేర్ సినిమాతో పాటు తన సినిమాల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నవ్వించడం పెద్ద వరం అని చెప్పిన ఎన్టీఆర్.. మనల్ని నవ్వించడానికే కళ్యాణ్ శంకర్ దొరికాడు. ఈ సినిమాలో లడ్డు (విష్ణు )లేకపోతే సినిమా హిట్ అయ్యేది కాదేమో. నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ అద్భుత పర్ఫార్మెన్స్ కనబరిచారు. దేవర సినిమాని మీ భుజాలపై వేసి మోసినందుకు థ్యాంక్యూ. దేవర 2 లేదని అనుకున్న వారందరికి కూడా ఓ విషయం చెబుతున్నాను. ఈ సినిమా కచ్చితంగా ఉంటుంది. మధ్యలో ప్రశాంత్ నీల్ రావడం వలన దానికి కాస్త గ్యాప్ ఇచ్చాయి. త్వరలోనే ఒక సినిమా నాగవంశీతో చేయబోతున్నాము. సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఫ్యాన్స్ అందరిని హ్యాండిల్ చేయమని వదిలేస్తాను” అని అన్నారు.
ఇక అదుర్స్ 2 సినిమా గురించి మాట్లాడుతూ.. కామెడీ పలికించడం యాక్టర్ కి చాలా కష్టమైన పని.అందుకే నేను అదుర్స్-2 చేయడానికి ఆలోచిస్తున్నాను అని అన్నారు. డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అదుర్స్ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా సీక్వెల్ గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ చేసిన కామెంట్స్‌తో అభిమానులు ఆలోచనలో పడ్డారు. అదుర్స్ 2 చిత్రం చేస్తారా లేదా అని ముచ్చటించుకుంటున్నారు.