Jr NTR | ప్రౌడ్ మూమెంట్.. ఆస్కార్ కమిటీ సభ్యుడిగా ఎన్టీఆర్‌ను పరిచయం చేసిన అకాడమీ
Jr NTR | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే మూమెంట్ ఇది. ఆస్కార్ కమిటీ ఎన్టీఆర్‌కు ఓ అరుదైన గౌరవాన్ని అందించింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ కమిటీలో కొత్త మెంబర్స్ లిస్ట్‌లో ఎన్టీఆర్‌ను చేర్చింది.
Jr NTR | ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ (Oscars) పురస్కారాన్ని గెలుచుకొని భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని విశ్వవేదికపై ఘనంగా చాటింది. దేశానికి తొలి ఆస్కార్‌ను అందించిన చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ చరిత్ర సృష్టించింది. ఇక ఈ చిత్రంతో టాలీవుడ్ స్టార్ నటులు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) గ్లోబల్ లెవల్లో ఓ రేంజ్ పాపులారిటీని సంపాదించుకున్నారు.
కాగా, తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే మూమెంట్ ఇది. ఆస్కార్ కమిటీ ఎన్టీఆర్‌కు ఓ అరుదైన గౌరవాన్ని అందించింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ కమిటీలోని నటుల కేటగిరీలోకి ఎన్టీఆర్‌ను చేర్చింది. ఈ విషయాన్ని అకాడమీ (Oscars Academy) సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు ఎన్టీఆర్‌ను కొత్త అకాడమీ మెంబర్‌గా పరిచయం చేస్తూ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట సమయంలోని విజువల్స్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం అకాడమీ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదో ప్రౌడ్ మూమెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు ఈ ఏడాది ఆస్కార్ కమిటీ 398 మందికి కొత్తగా ఆస్కార్ ప్యానెల్లో చోటు కల్పించబోతున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ నుంచి పదకొండు మంది సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఇందులో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ‘ఆర్ఆర్ఆర్’ బృందం రామ్‌చరణ్, ఎన్టీఆర్, సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, ఛాయాగ్రాహకుడు సెంథిల్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్లకు ఆహ్వానాలు అందాయి. వీరితోపాటు ప్రముఖ దర్శకులు మణిరత్నం, కరణ్‌జోహార్, సిద్ధార్థ్ రాయ్ కపూర్, చైతన్య తమహానే, షానెక్ సేన్లు కూడా ఆస్కార్ కమిటీ నుంచి ఆహ్వానాల్ని అందుకున్నారు. అందులో భారత్ నుంచి ఎన్టీఆర్‌ను కమిటీ సభ్యుడిగా ఆస్కార్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆస్కార్ కమిటీ సభ్యుడిగా నియమితులైన తొలి తెలుగు హీరోగా ఎన్టీఆర్ ఖ్యాతి దక్కించుకున్నారు. ఇక కొత్తగా ఆస్కార్ ప్యానెల్లో చోటు దక్కించుకున్న వారందరికీ రాబోవు ఆస్కార్ అవార్డుల ఎంపికలో ఓటు హక్కు ఉంటుంది.
ఆర్ఆర్ఆర్..
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గతేడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భాషతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా అదరగొట్టింది. ఆడియన్స్ ను మెప్పించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టింది. అంతేకాదు, భారతీయ సినిమా ఖ్యాతిని ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఆస్కార్ వేదిక వరకూ తీసుకెళ్లింది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డును గెలుచుకుంది.
Also Read..
Leo | థియేటర్లలో ‘లియో’ సందడి.. డప్పుల మోతలు, డ్యాన్సులతో హోరెత్తిస్తున్న అభిమానులు
Ramcharan | రామ్ చరణ్ ఇటలీ ట్రిప్ వెళ్లడానికి కారణం ఉపాసన అని తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

