మహిళా శక్తి గురించి చెబుతుంది
‘భగవంత్ కేసరి’ చిత్రంలో స్త్రీ శక్తి, మహిళా సాధికారత గురించి గొప్పగా ఆవిష్కరించారని, ఇలాంటి స్ఫూర్తివంతమైన కథలో భాగం కావడం ఆనందంగా ఉందని చెప్పింది కాజల్.
‘భగవంత్ కేసరి’ చిత్రంలో స్త్రీ శక్తి, మహిళా సాధికారత గురించి గొప్పగా ఆవిష్కరించారని, ఇలాంటి స్ఫూర్తివంతమైన కథలో భాగం కావడం ఆనందంగా ఉందని చెప్పింది కాజల్. ఈ సినిమాలో కాత్యాయని పాత్రలో ఆమె కనిపించనుంది. బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలకానుంది. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ ‘కాత్యాయని ఒక సైకాలజిస్ట్.
తను చాలా తెలివైన మహిళ. కథాగమనంలో నా పాత్ర కీలకంగా ఉంటుంది. ఈ సినిమాలోని మహిళా శక్తి అనే కాన్సెప్ట్ నాకు వ్యక్తిగతంగా బాగా కనెక్ట్ అయింది. ఆడపిల్లను ధైర్యంగా పెంచాలనే అంశం గొప్పగా అనిపించింది. ఇలాంటి కథ నేటి సమాజానికి అవసరం అనిపించింది’ అని చెప్పింది. బాలకృష్ణ సెట్స్లో చాలా సరదాగా ఉంటారని, షూటింగ్ అంతా హ్యాపీగా సాగిందని కాజల్ అగర్వాల్ తెలిపింది. ‘దర్శకుడు అనిల్రావిపూడిలో సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ. ఆయన తీసిన ‘ఎఫ్-2’ ‘ఎఫ్-3’ సినిమాలు బాగా నచ్చాయి. ‘భగవంత్ కేసరి’లో ఆయన శైలి వినోదంతో పాటు సందేశం కూడా ఉంటుంది. ప్రస్తుతం ‘సత్యభామ’ సినిమా చేస్తున్నా. ఇక ‘ఇండియన్-2’లో నా పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి’ అని కాజల్ అగర్వాల్ చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

