Jr NTR | దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR). కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా అనంతరం తారక్ వార్ 2 సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రంలో తారక్ నెగటివ్ రోల్లో కనిపిస్తారని సమాచారం. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుండగా.. రీసెంట్ గా ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవ్వడానికి ముంబై వెళ్లాడు. ఇక బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి తారక్ ముంబై వెళుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో తారక్ షార్ట్ హెయిర్‌తో మాస్ లుక్‌లో అలరిస్తున్నాడు.
Off to mumbai for #War2 ✈️@tarak9999 #ManOfMassesNTR pic.twitter.com/NfcwdnC6ir
— WORLD NTR FANS (@worldNTRfans) October 19, 2024