‘ఆర్ఆర్ఆర్’ చిత్ర అపూర్వ విజయంతో ఉత్సాహంగా ఉన్నారు అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్. ఇటీవలే జపాన్‌లో ప్రదర్శితమైన ఈ సినిమా అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ విజయానందంలో ఎన్టీఆర్ తన తదుపరి సినిమాకు సన్నద్ధమవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్నది.
సామాజిక అంశాల్ని స్పృశిస్తూ రూపొందిస్తున్న ఈ కథలో ఎన్టీఆర్ సరికొత్త లుక్స్‌తో కనిపించనున్నారని ప్రచారం జరిగింది. అందుకు తగినట్లుగానే శుక్రవారం హెయిర్ ైస్టెలిష్ట్ ఆలీమ్ హకీమ్ తన సోషల్‌మీడియా ఖాతాలో ఎన్టీఆర్ మేకోవర్ ఫొటోను పోస్ట్ చేశారు. ఇందులో కాస్త గడ్డాన్ని ట్రిమ్ చేసుకొని, స్ట్రెయిట్ హెయిర్ ైస్టెల్లో ఎన్టీఆర్ ట్రెండీగా కనిపిస్తున్నారు. కర్లీ హెయిర్స్ స్థానంలో ఈ సరికొత్త కేశాలంకరణ ఎన్టీఆర్‌కు బాగా సూటయిందని అభిమానులు అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ మూవీ త్వరలో సెట్స్‌మీదకు రానుంది.