భాషా హద్దులు చెరిగిపోయి ప్రాంతీయ సినిమా జాతీయ స్థాయిలో ఆదరణ పొందుతున్న ప్రస్తుత ట్రెండ్‌లో మన స్టార్ హీరోలు నేరుగా హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ జాబితాలో ఎన్టీఆర్ కూడా చేరారనే విషయం ఇప్పటికే వెల్లడైంది. ఆయన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వివరాలు మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.
అయితే ఆ వివరాలు ఎప్పుడు చెబుతారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ పుట్టిన రోజైన ఈ నెల 20న ఆయన బాలీవుడ్ చిత్ర ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. ఇదే రోజు ఎన్టీఆర్, కొరటాల సినిమా నుంచి టైటిల్ గానీ, ఫస్ట్ లుక్ గానీ విడుదల చేస్తారట. అలాగే ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ చేస్తున్న సినిమాను కూడా అనౌన్స్ చేస్తారని తెలుస్తున్నది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది.