తారక్ ప్రస్తుతం ‘వార్ 2’లోని తన పార్ట్‌ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలా భాగం షూటింగ్ పూర్తయింది. ఇండియాతోపాటు దుబాయ్, మలేషియాలో మూడు షెడ్యూల్స్ పూర్తి చేశారు దర్శకుడు ఆయాన్ ముఖర్జీ. రీసెంట్ షెడ్యూల్లో ఎన్టీఆర్ సోలో ఎపిసోడ్స్‌తోపాటు హృతిక్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌ని పూర్తి చేసుకొని ఇటీవలే తారక్ హైదరాబాద్ చేరుకున్నారట. ‘దేవర’ షూటింగ్ పూర్తవ్వగానే గ్యాప్ తీసుకోకుండా ‘వార్ 2’ని మొదలుపెట్టేశారు తారక్.
ఈ సినిమా పూర్తిచేసి, వెంటనే ప్రశాంత్‌నీల్ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇవ్వాలి. నిజానికి జనవరి నుంచే ప్రశాంత్‌నీల్ సినిమాను పట్టాలెక్కించాలనుకున్నాడు తారక్. కానీ ‘వార్2’ లేట్ అవ్వడంతో ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరికి మారింది. అందుకే ఎట్టిపరిస్థితుల్లో జనవరిలో ‘వార్ 2’కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారాయన. ఆగస్ట్ నుంచి ‘వార్2’ ప్రమోషన్స్ కూడా ఎన్టీఆర్ డేట్స్ ఇవ్వాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని యష్‌రాజ్ సంస్థని తారక్ పరుగులు పెట్టిస్తున్నారని వినికిడి.