సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్న క్రేజీ చిత్రాల్లో బాలీవుడ్ స్పై థ్రిల్లర్ ‘వార్ 2’ ఒకటి. నార్త్ స్టార్ హృతిక్ రోషన్, సౌత్ స్టార్ ఎన్టీఆర్ కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌కి డబ్బింగ్ చెప్పే పనిలో ఉన్నారట. ఇందులోని ఎన్టీఆర్ పాత్ర గురించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ వెలుగు చూసింది. ఈ సినిమా సెకండాఫ్‌లో ఎన్టీఆర్ పాత్రకు ఓ అద్భుతమైన ఫ్లాష్‌బ్యాక్ ఉంటుందట. ఈ ఎపిసోడ్లో యంగ్ టైగర్ ఇచ్చే సర్ప్రైజ్ ఊహించని విధంగా ఉంటుందని తెలుస్తున్నది.
ఈ సినిమాలోని తారక్ లైవ్ గెటప్‌కీ, ఫ్లాష్‌బ్యాక్ గెటప్‌కీ అసలు పోలికే ఉండదట. ఇక హృతిక్, తారక్ ఎదురెదురు పడినప్పుడు భీకరపోరాటాలతో థియేటర్లు దద్దరిల్లుతాయని మేకర్స్ చెబుతున్నారు. కియరా అద్వాణీ ఇందులో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.