‘ఆర్ఆర్ఆర్’ వచ్చి రెండేండ్లు నిండి మూడో ఏడు నడుస్తున్నది. ఇంకా ఎన్టీఆర్ నుంచి సినిమా రాలేదు. ఆయన అభిమానుల్ని బాధిస్తున్న విషయం ఇది. తారక్ మాత్రం ఖాళీగా లేకుండా ఇటు ‘దేవర’తో అటు ‘వార్’తో బిజీబిజీగా ఉన్నారు. ఎట్టకేలకు ‘దేవర-1’ షూటింగ్ తుదిదశకు చేరుకుంది. ఈ సినిమాతో ఫ్యాన్స్‌కి వండర్ఫుల్ ట్రీట్ ఇచ్చేందుకు దర్శకుడు కొరటాల శివ సిద్ధమవుతున్నారు. తాజాగా ఎన్టీఆర్, జాన్వీకపూర్‌లపై ఓ అద్భుతమైన రొమాంటిక్ సాంగ్‌ని చిత్రీకరించారు కొరటాల. ఈ పాటను త్వరలోనే మేకర్స్ విడుదల చేయనున్నారు. రామజోగయ్యశాస్త్రి ఈ పాట రాశారు.
తాజాగా ఆయన తన ఎక్స్‌లో (ట్విటర్) ఈ పాట గురించి స్పందించారు. ‘తంగం అంతరంగం హాయిగా ఉయ్యాలలూగుతున్నట్టుంటుంది.. ఇప్పుడే విన్నా.. అతి త్వరలో సాంగ్ వచ్చేస్తోంది.. వెయిట్ చేసినందుకు మంచి ఫలితం ఉంటుంది.’ అనేది ఈ ట్వీట్ సారాంశం. మొత్తానికి ఒక్క ట్వీట్‌తో అభిమానుల్లో అంచనాలు పెంచేశారు రామజోగయ్యశాస్త్రి. ఇందులో జాన్వికపూర్ పాత్ర పేరు ‘తంగం’. ఆమె పేరు మీదే ఈ పాట నడుస్తుందని శాస్త్రి క్లారిటీ ఇచ్చేశారు. తంగం అంటే తమిళంలో బంగారం అని అర్థం. ఏదేమైనా సెప్టెంబర్ చివరివారంలో సినిమా విడుదల కానుంది. ఇది హిట్ అయిన వెంటనే ‘దేవర 2’ షూటింగ్ మొదలవుతుంది. ఇందులో సైఫ్అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.