‘ధూమ్’ సిరీస్‌లో జాన్అబ్రహం, హృతిక్, ఆమీర్ఖాన్లు పోషించిన సూపర్‌హీరోస్ పాత్రలపై ఓ బుక్ రాయొచ్చు. భారతీయ వెండితెరకు హాలీవుడ్ హంగులద్దిన పాత్రలవి. వాటి ప్రేరణతో ‘వార్’ చిత్రాన్ని కూడా నిర్మించింది యష్‌రాజ్ సంస్థ. ఇప్పుడు ‘వార్-2’కి రెడీ అయ్యింది. ఇందులో సూపర్‌హీరోగా మన టాలీవుడ్ స్టార్ తారక్ కనిపించనుండటం విశేషం.
ఇది తెలుగు ప్రేక్షకులందరూ ఆనందించాల్సిన, గర్వించాల్సిన విషయమే. ప్రస్తుతం ‘దేవర’ షూటింగ్లో బిజీగా ఉన్న తారక్ ‘వార్-2’ షూటింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చేదెప్పుడు? అనే విషయంపై గతంలో పలురకాల వార్తలు వచ్చాయి. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. వచ్చే ఏడాది మార్చి రెండోవారం నుంచి తారక్ ‘వార్-2’ షూటింగ్లో పాల్గొనబోతున్నాడు.
రెండువారాలపాటు ఈ షెడ్యూల్ జరుగుతుందని తెలిసింది. మళ్లీ ఏప్రిల్‌లో ‘దేవర’ షెడ్యూల్లో పాల్గొంటాడు తారక్. మళ్లీ మే నెలలో ‘వార్-2’ షెడ్యూల్ ఉంటుందట. ఈ షెడ్యూల్లో హృతిక్, తారక్‌లపై యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్నాడు. దీనికోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌ని రంగంలో దించుతున్నారనేది లేటెస్ట్ న్యూస్.
ఇక ‘వార్-2’ కథ విషయానికొస్తే.. ఇది ఇద్దరు స్నేహితుల కథ అని తెలుస్తున్నది. కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారట. కానీ మంచి కోసం మళ్లీ కలిసి చెడుపై యుద్ధం చేస్తారట. ఆ ఇద్దరు స్నేహితులుగా హృతిక్, తారక్ నటిస్తుండగా, జాన్అబ్రహం ఇందులో నెగిటీవ్ పాత్ర పోషించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. కైరా అద్వానీ కథానాయికగా ఖరారైనట్టు తెలుస్తున్నది.