గోపీచంద్ ‘రణం’ సినిమాతో బిజూ మీనన్ తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుం కోషియుమ్’ నటుడిగా బిజూ మీనన్ ఏంటో చెప్పింది. ‘భీమ్లానాయక్’గా ఆ సినిమా తెలుగులో రీమేక్ అయితే.. బిజూ మీనన్ పాత్రను పవన్‌కల్యాణ్ పోషించారు. దీంతో తెలుగులో కూడా బీజూ మీనన్ పేరు బాగా వినపడింది. అలాగే టోవినో థామస్.
ప్రస్తుతం మలయాళంలో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరో. ఏడాదిన్నర క్రితం విడుదలైన ఆయన ‘2018’ సినిమా తెలుగులోనూ బాగా ఆడింది. ఆ విధంగా వీరిద్దరూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ఇప్పుడు వీరి గురించి టాపిక్ దేనికంటే.. ఎన్టీఆర్, ప్రశాంత్‌నీల్ సినిమాలో వీరిద్దరూ భాగం కానున్నారు.
టాలీవుడ్‌కీ తారక్, శాండల్‌వుడ్‌కి ప్రశాంత్‌నీల్, రుక్మిణీ వసంత్.. మల్లూవుడ్కి బీజూమీనన్, టోవినో థామన్.. మొత్తానికి అన్ని భాషల్లోని స్టార్స్నీ ఈ పానిండియా సినిమాతో ఏకం చేస్తున్నారు ప్రశాంత్‌నీల్. ముందుముందు ఈ ప్రాజెక్టులో ఇంకెందరు భాగం అవుతారో చూడాలి. సంక్రాంతి తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని సమాచారం.