Johnny Master Wife | తెలుగు సినిమా, టీవీ డాన్సర్స్ అసోసియేషన్ (TFTDDA) అధ్యక్ష ఎన్నికల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా అద్భుత విజయాన్ని సాధించారు. మొత్తం 510 ఓట్లలో 439 ఓట్లు పోల్ కాగా… అందులో సుమలత 228 ఓట్లు సాధించింది. ఆమె ప్రధాన ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాశ్ మాస్టర్ 199 ఓట్లకు మాత్రమే పరిమితమయ్యారు. మరో అభ్యర్థి చంద్రశేఖర్‌కు 11 ఓట్లు లభించాయి. దీంతో 29 ఓట్ల మెజారిటీతో సుమలత అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. ఈ ఎన్నికల ప్రత్యేకత ఏమిటంటే… సుమలత వెనుక ఎలాంటి గ్రూప్, సీనియర్ మాస్టర్ల మద్దతు లేకపోవడం. పూర్తిగా ఒంటరిగా బరిలోకి దిగినా, గ్రౌండ్ లెవల్లో ఆమెకు లభించిన మద్దతు అనూహ్యంగా భారీగా మారి విజయం దక్కించింది. అసోసియేషన్‌లో ఇది పెద్ద చర్చగా మారింది.
జోసెఫ్ ప్రకాశ్ మాస్టర్‌కు శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, రఘు మాస్టర్, పొల్లకి విజయ్, జోజో శామ్, చంద్రకిరణ్ వంటి పలువురు సీనియర్ కొరియోగ్రాఫర్లు బహిరంగ మద్దతు ప్రకటించారు. అదే విధంగా, గతంలో జానీ మాస్టర్‌పై కేసులు వేసి జైలుకు పంపేందుకు కారణమైన డాన్సర్ సృష్టి వర్మ కూడా జోసెఫ్‌కు మద్దతుగా గట్టిగా క్యాంపెయిన్ చేశారు. ఉదయం నుంచి ఓటింగ్ ముగిసే వరకు అక్కడే ఉండి, ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేసినా… సుమలత తరఫున వచ్చిన ఓట్ల శాతం అన్ని లెక్కలను మార్చేసింది. జానీ మాస్టర్ భార్యని ఓడించాలన్న ఉద్దేశంతో సృష్టి వర్మ చేసిన హై వోల్టేజ్ క్యాంపెయిన్ చివరికి వేస్ట్ అయింది.
అసోసియేషన్ సభ్యుల మధ్య సుమలతకు ఉన్న నమ్మకం, సాన్నిహిత్యం, ఆమె వ్యక్తిత్వం ఇవే చివరికి ఆమె విజయానికి కారణమయ్యాయి. జానీ మాస్టర్‌పై వచ్చిన ఆరోపణల సమయంలో సుమలత చేసిన పోరాటం సభ్యులను ప్రభావితం చేసింది. జానీ మాస్టర్‌పై వచ్చిన తీవ్రమైన ఆరోపణల సమయంలో కుటుంబం భారీ మానసిక ఒత్తిడిని ఎదుర్కొంది. ఆ సమయంలో కోర్టు కేసులు, పోలీసు విచారణలు, ఇండస్ట్రీలో నమ్మకం కోల్పోవడం ఇలా ఎన్నో సమస్యలు వచ్చినా, సుమలత మాత్రం భర్తకు అండగా నిలిచారు. ఈ సంయమనంతో, ధైర్యంతో, బలమైన వ్యక్తిత్వంతో ఆమె పట్ల టెక్నీషియన్లలో మంచి గౌరవం పెరిగింది. అదే గౌరవం చివరకు పోలింగ్ బూత్‌లో ఓట్ల రూపంలో ప్రతిఫలించింది. విజయం తర్వాత జానీ మాస్టర్ భార్యకు ముద్దులిస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.