రాకేష్ వర్రే ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జితేందర్ రెడ్డి’. ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి విరించివర్మ దర్శకుడు. ఈ నెల 8న విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో హీరో రాకేష్ వర్రే మాట్లాడుతూ ‘జితేందర్ రెడ్డి ఓ ఫైటర్. ఆయన పోరాటతత్వాన్ని ఈ సినిమాలో చూపించాం.
75 రూపాయలతో ఈ సినిమా ప్రీమియర్షోస్కు ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. జగిత్యాలలో జరిగిన యథార్థ సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని దర్శకుడు విరించి వర్మ తెలిపారు. ఈ సినిమా ప్రీమియర్ చూసినవాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారని, అంతలా హృదయాన్ని కదిలించే సన్నివేశాలుంటాయని నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి అన్నారు. ఈ చిత్రానికి గోపీసుందర్ స్వరకర్త.