కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘జ్యువెల్ థీఫ్’. పీఎస్ నారాయణ దర్శకత్వంలో మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల నటుడు పృథ్వీ విడుదల చేశారు. తాను సూపర్‌స్టార్ కృష్ణ అభిమానినని, ఆయన స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చానని, సస్పెన్స్.. థ్రిల్లింగ్ అంశాలతో ‘జ్యువెల్ థీఫ్’ ఆకట్టుకుంటుందని హీరో తెలిపారు. కృష్ణసాయి నిజజీవితంలో కూడా హీరోనేనని, ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని పృథ్వీ ప్రశంసించారు. సీనియర్ ఆర్టిస్టులు సినిమాలో నటించారని, భారీ స్థాయిలో విడుదల చేస్తామని నిర్మాత మల్లెల ప్రభాకర్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ.