Jersey Girls | ఛిల్ అవుట్ మూడ్‌లో జెర్సీ భామలు.. ట్రెండింగ్‌లో స్టిల్
Jersey Girls | టాలీవుడ్ (Tollywood) హీరో నాని (Nani) నటించిన చిత్రం జెర్సీ (Jersey). శ్రద్దాశ్రీనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. జెర్సీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. హిందీ వెర్షన్లో మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్గా మెరిసింది.
Jersey Girls | టాలీవుడ్ (Tollywood) హీరో నాని (Nani) నటించిన చిత్రం జెర్సీ (Jersey). శ్రద్దాశ్రీనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. ఈ సినిమాతో శ్రద్దా శ్రీనాథ్ (Shraddha Srinath) ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇక జెర్సీ చిత్రాన్ని హిందీలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి రెండు భాషల్లో గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వం వహించాడు. హిందీ వెర్షన్లో మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్గా మెరిసింది.
జెర్సీ సినిమా హీరోయిన్లకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా జెర్సీ సినిమా హీరోయిన్లు ఒకే ఫ్రేమ్‌లో సందడి చేస్తున్న ఫొటో నెట్టింటిని షేక్ చేస్తోంది. ఇంతకీ ఈ ఇద్దరు ఎక్కడ కలిశారనుకుంటున్నారా..? జిమ్ సెషన్‌కు వెళ్లారు. ఇద్దరూ జిమ్ వేర్లో ఛిల్ అవుట్ మూడ్‌లో కనిపిస్తున్న ఫొటో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. తెలుగులో అవార్డులు అందుకున్న జెర్సీ హిందీలో మాత్రం ఊహించని స్థాయిలో ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. హిందీలో దిల్ రాజు, నాగవంశీ, అమన్ గిల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సాచెట్ అండ్ పరంపర మ్యూజిక్ అందించారు.
గతేడాది సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది మృణాళ్ ఠాకూర్. ఈ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2తో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ భామ ఖాతాలో మూడు హిందీ సినిమాలున్నాయి. తెలుగులో నాని హీరోగా నటిస్తున్న హాయ్ నాన్న చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. శ్రద్దా శ్రీనాథ్ పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న సైంధవ్‌లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. దీంతోపాటు తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఒక్కో సినిమా చేస్తోంది.
when vidya met sarah #Jersey 😍❤️#MrunalThakur #ShraddhaSrinath pic.twitter.com/XHNK0UIspo
— y. (@yaaro__oruvan) July 26, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

