జేడీ చక్రవర్తి, శుభ రక్ష, నిత్య ముఖ్యతారలుగా రూపొందిన చిత్రం ‘హు’. జేడీ చక్రవర్తి దర్శకుడు. రెడ్డమ్మ కే బాలాజీ నిర్మాత. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం ఇటీవల హైదరాబాద్లో జరిగింది. ట్రైలర్ను నిర్మాత ప్రసన్నకుమార్, నటుడు నాగమహేష్ విడుదల చేశారు.
చిత్ర పోస్టర్ను నిర్మాతలు ఆచంట గోపినాథ్, శోభారాణి, కొల్లి రామకృష్ణ ఆవిష్కరించారు. నిర్మాత మాట్లాడుతూ ‘జేడీ చక్రవర్తి స్వీయ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ ఇది. జేడీ నటన, ఆయన పాత్ర చిత్రానికి హైలైట్గా వుంటుంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’అన్నారు.