కమల్‌హాసన్ కూడా చేయని పాత్ర
నటులందరికీ కొలమానం కమల్‌హాసన్. ప్రపంచ సినీచరిత్రలో ఆయన చేసినన్ని వైవిధ్యమైన పాత్రలు ఎవరూ చేయలేదు.. చేయబోరు. అయితే.. ‘గాయపడ్డ సింహం’లో నేను పోషించిన ‘ధర్మ’ తరహా పాత్ర ఆయనక్కూడా రాలేదు.
‘నటులందరికీ కొలమానం కమల్‌హాసన్. ప్రపంచ సినీచరిత్రలో ఆయన చేసినన్ని వైవిధ్యమైన పాత్రలు ఎవరూ చేయలేదు.. చేయబోరు. అయితే.. ‘గాయపడ్డ సింహం’లో నేను పోషించిన ‘ధర్మ’ తరహా పాత్ర ఆయనక్కూడా రాలేదు. ఆయన కూడా చేయలేదు. ఇది నాకు మాత్రమే దక్కిన అదృష్టం. ఈ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇది నా కెరీర్లోనే గుర్తుండిపోయే పాత్ర. కశ్యప్ తప్పకుండా ఇన్నోవేటివ్ డైరెక్టర్ అవుతాడు. పవన్ సాధినేని భుజాలపై ఈ సినిమాను మోశాడు. ఇది డైరెక్టర్స్ సినిమా. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అని జేడీ చక్రవర్తి అన్నారు. తరుణ్‌భాస్కర్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘గాయపడ్డ సింహం’.
జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషిస్తున్నారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకుడు. చక్రవర్తి మంతిన, భానుకిరణ్ ప్రతాప, విజయ్‌కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ నిర్మాతలు. పవన్ సాధినేని సమర్పకుడు. మే 1న సినిమా రిలీజ్ కానుంది. జేడీ చక్రవర్తి పోషిస్తున్న ధర్మ పాత్రను పరిచయం చేస్తూ రూపొందించిన గ్లింప్స్‌ని సోమవారం హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో జేడీ చక్రవర్తి మాట్లాడారు. ఇందులో జేడీ చక్రవర్తి మాఫియా డాన్‌గా నటిస్తున్నట్టు గ్లింప్స్ చెబుతున్నది. మాఫియా డాన్ ధర్మ చేసే ఆయుధాల అక్రమ రవాణా, డ్రగ్స్ తదితర యాక్టివిటీస్‌ని ఈ గ్లింప్స్‌లో చూడొచ్చు. జేడీ చక్రవర్తి స్క్రీన్‌ప్రెజెన్స్, ‘బ్రూటల్ ధర్మ’గా ఆయన మేకోవర్ ఆకర్షణీయంగా ఉంది. ఇంకా ఈ కార్యక్రమంలో పవన్ సాదినేని, డైరెక్టర్ కశ్యప్, నిర్మాత భాను కిరణ్ ప్రతాప కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

