JD Chakravarthy Interview | టాలీవుడ్ టాలెంటెడ్ యాక్లర్లలో ఒకరు జేడీ చక్రవర్తి (JD Chakravarthy). పవన్ సాదినేని దర్శకత్వంలో జేడీ చక్రవర్తి తొలిసారి డిజిటల్ డెబ్యూ ఇస్తున్న ప్రాజెక్టు దయా. రమ్య నంబీషన్, ఈషా రెబ్బా, కమల్ కామరాజు, విష్ణు ప్రియ కీలక పాత్రల్లో నటించారు. SVF bannerపై మహేంద్ర సోని తెరకెక్కించారు. ఆగస్టు 4న డిస్నీ+హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో జేడీ చక్రవర్తి మీడియాతో చిట్ చాట్ చేశాడు. దయా వెబ్‌సిరీస్ విశేషాలు జేడీ మాటల్లోనే..
ఈ వెబ్‌సిరీస్‌లో భాగం కావడానికి కారణం..?
కంటెంట్ ప్రిన్స్, డైరెక్టరే రాజు అని బలంగా నమ్ముతా. పవన్ సాదినేని కథనం ఇంప్రెస్ చేయడంతో వెంటనే వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఒప్పుకున్నా. కథ మనమనుకున్న థీమ్‌లో ఉంటే అందులో అందమైన ఇల్లు కట్టుకోవచ్చు.
దయా కోసం మిమ్మల్ని ఎలా సంప్రదించారు..?
హాట్ స్టార్ నన్ను సంప్రదించింది. నేను సిరీస్‌లో నటించే మూడ్ లేక వాయిదా వేస్తూ వచ్చా. వారు నన్ను ఒప్పించి, సారాంశాన్ని కూడా పంపారు. ఆ తర్వాత దర్శకుడు పవన్ సాదినేని ఫోన్లో పది నిమిషాల పాటు కథ వినిపింఇ… పూర్తి స్క్రిప్ట్ చెప్పాలా అని నన్ను అడిగారు. కానీ నేను పూర్తి కథనం వినకుండానే ఒకే చెప్పేశాను. పది నిమిషాల్లో కథ చెప్పగల దర్శకుడికి స్క్రిప్ట్‌పై గట్టి పట్టు ఉంటుందని ఆర్జీవీ ఓసారి అన్నారు.
దయా సిరీస్‌కు బలం ఏంటి..?
దయా సిరీస్‌కు డైరెక్టర్ పవన్ చాలా బలం. అన్ని పాత్రలు చాలా యూనిక్‌గా డిజైన్ చేశాడు. నటీనటులకు మంచి గుర్తింపు తెచ్చే పాత్రలు కూడా రాశారు. నా తొలి సినిమా శివతో నేను జేడీ అయ్యాను. అంతేకాదు బాహుబలి తర్వాత సత్యరాజ్ కట్టప్ప అయిపోయారు. దయా బలమైన పాత్రలతో సాగే వెబ్‌సిరీస్.
దయాలో మీ పాత్ర గురించి ఏం చెప్తారు..?
దయాలో ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్‌గా నటించా. చేపలను ఒక ఊరి నుంచి మరో ఊరికి తీసుకెళ్తుంటా. పవన్ మొదట 10-12 నిమిషాల నుంచి దయా ప్రపంచాన్ని చాలా తెలివిగా చూపించగలిగాడు. ఓ రోజు ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ ఓ అమ్మాయి డెడ్ బాడీ చూస్తాడు. ఆ విషయాన్ని పోలీసులకు చెప్పేంత ధైర్యం అతడికి ఉండదు. అతడు మరో బాడీని కూడా చూస్తాడు. ఈ ఘటనలతో డ్రైవర్ జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడతాయి.
టాలీవుడ్, బాలీవుడ్‌ను ఎలా చూస్తారు..?
బాలీవుడ్ నాకు పొరుగిల్లులాంటిది. అందుకే కొన్నాళ్లు అక్కడకు వెళ్లా. కానీ నా బలం తెలుగు చిత్ర పరిశ్రమే. అందుకే మళ్లీ ఇక్కడ ప్రాజెక్టులు చేస్తున్నా. ఇండస్ట్రీలో డిమాండ్, సప్లై గురించి మీకు ఓ ఐడియా ఉంది. నాకు చాలా ఆఫర్లు వస్తున్నాయి. నేను నటించడం లేదని చెప్తే అబద్దం అవుతుంది. కానీ నాకు కొన్ని నచ్చని పాత్రలు ఉన్నాయి.
ఓటీటీ స్టార్‌డమ్‌ను ఎలా కొలుస్తారు..?
OTTలో స్టార్‌డమ్‌ను లెక్కించలేమని చెప్పడం సరికాదు. సినిమా తీర్పును నిర్ణయించేందుకు కలెక్షన్లను పరిశీలిస్తాం. OTT కోసం ఎంత మంది షో లేదా సినిమా చూశారో చూస్తాం. కథను విస్తృతంగా చెప్పడానికి సినిమా కంటే వెబ్ సిరీస్ అద్భుతమైన మార్గం. OTTలు కొత్తవారికి సహాయం చేస్తాయి. థియేటర్ల విషయానికి వస్తే స్టార్ల సినిమాలకే బయ్యర్లు ఉంటారు.