Jayamma Panchayathi | ప్రమోషన్స్ లో జయమ్మ దూకుడు..హిట్టు కొట్టినట్టే..!
15 ఏళ్లుగా తిరుగులేని యాంకర్‌గా దూసుకుపోతుంది సుమ. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ సినిమాల వైపు వస్తుంది సుమ. ఇప్పటికీ ఈమె డేట్స్ కోసం నిర్మాతలు వేచి చూస్తుంటారు.
హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టిన సుమ (Suma)..ఆ తర్వాత యాంకర్‌గా మారిపోయింది. అక్కడ్నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. 15 ఏళ్లుగా తిరుగులేని యాంకర్‌గా దూసుకుపోతుంది సుమ. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ సినిమాల వైపు వస్తుంది సుమ. ఓవైపు యాంకర్‌గా కంటిన్యూ అవుతూనే..మరోవైపు సినిమాలు కూడా చేస్తుంది సుమ. ఇప్పటికీ ఈమె డేట్స్ కోసం నిర్మాతలు వేచి చూస్తుంటారు.
ఇండస్ట్రీలో ఏదైనా ఈవెంట్ జరగాలి అంటే సుమ యాంకర్ అయితే చాలు..ప్రోగ్రామ్ సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం అందరిలోనూ కలిగించింది ఈమె. అందుకే సుమ రెమ్యూనరేషన్ కూడా అలాగే ఉంటుంది. ఒక్కో ఈవెంట్ కోసం కనీసం 3 నుంచి 5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే టీవీలో ఒక్కొక్క ఎపిసోడ్ కోసం కనీసం లక్ష రూపాయలకు పైనే రెమ్యూనరేషన్ అందుకుంటుంది సుమ. బుల్లితెరపై ఈ స్థాయిలో దూసుకుపోతుంది కాబట్టే సినిమాల వైపు అస్సలు చూడలేదు ఈమె. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సినిమాల్లోకి వచ్చింది.
ఈమె ప్రధాన పాత్రలో వస్తున్న జయమ్మ పంచాయితీ (Jayamma Panchayathi) మే 6న విడుదల కానుంది. దీని ప్రమోషన్స్ (Jayamma Panchayathi Promotions) కూడా జోరుగా జరుగుతున్నాయి. నాని, నాగార్జున ముఖ్య అతిథులుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈవెంట్ సూపర్ హిట్ అయింది. అందులో సుమ గురించి మాట్లాడుతూ అంతా ఎమోషనల్ అయ్యారు.ప్రమోషన్ జరుగుతున్న తీరు.. సుమకు ఉన్న క్రేజ్ చూసిన తర్వాత ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం దాదాపు 50 లక్షల వరకు ఛార్జ్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఆమెకున్న క్రేజ్ కారణంగా నిర్మాతలు కూడా సై అనేసారు.
సుమ ఉంటే కచ్చితంగా థియేటర్స్ పరిస్థితి ఎలా ఉన్నా.. టీవీలోనే వర్కవుట్ అయిపోతుంది. అక్కడే బడ్జెట్ అంతా రికవర్ అవుతుంది. ఎందుకంటే టెలివిజన్ లో సుమకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి. విజయ్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు. జయమ్మ పంచాయితీ కానీ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసిందంటే.. సుమకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. చూడాలిక ఏం జరగబోతుందో..?
Read Also : Hansika Motwani | మాల్డీవుల్లో మతులు పోగొడుతున్న హన్సిక..వీడియో వైరల్
Read Also : SVP Trailer | అమ్మాయిల్ని, అప్పు ఇచ్చేవాళ్లని రఫ్‌గా హ్యాండిల్ చేయకూడదు..మహేశ్ పంచ్ డైలాగ్స్ తో ట్రైలర్
Read Also : Shraddha Srinath | జెర్సీ హీరోయిన్ పాన్ ఇండియా సినిమాకు టైటిల్ ఫిక్స్
Read Also : Niharika Konidela | నిహారిక బ్యాక్ టు సోషల్ మీడియా..ఈ గ్యాప్‌లో 3 పాఠాలు నేర్చుకుందట
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

