Ponniyin Selvan 2 | మణిరత్నం (Mani Ratnam) కాంపౌండ్ నుంచి వచ్చిన పొన్నియన్ సెల్వన్ ప్రాంచైజీ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్-2 (Ponniyin Selvan-2). భారీ మల్టీస్టారర్ పొన్నియన్ సెల్వన్ -1కు కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. సాధారణంగా సినిమా షూటింగ్ అంటే సీరియస్ ఎలిమెంట్స్ తోపాటు ఫన్నీ విషయాలు కూడా ఉంటాయని తెలిసిందే. షూటింగ్ స్పాట్లో ఆఫ్‌స్క్రీన్‌లో జరిగే చాలా విషయాల గురించి యూనిట్ మెంబర్స్ కు కాకుండా ఎక్కువ మందికి తెలియదు.
అయితే తాజాగా అలాంటి అరుదైన స్టిల్స్ కొన్ని నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఫన్నీ బీటీఎస్ ఫొటోలను శోభితా ధూళిపాళ షేర్ చేసింది. షూటింగ్ స్పాట్లో అరుణ్ మొళి పాత్రలో నటించిన జయంరవి నిద్రపోతున్నపుడు తీసిన ఫొటోను షేర్ చేసింది. ఇక భారీ పడవలో కుందవై గెటప్‌లో ఉన్న త్రిష గాలి కోసం టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని కనిపిస్తోంది. కాస్ట్యూమ్ డిజైనర్ ఏక లఖని గాయాలతో ఉన్న కార్తీతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. వీటిలో త్రిష ఫొటో హైలెట్‌గా నిలుస్తుందంటున్నారు సినీ జనాలు.
పొన్నియన్ సెల్వన్ 2లో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, శరత్‌కుమార్, ప్రకాశ్ రాజ్,ఐశ్వర్య లక్ష్మితోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే స్టోరీతో వస్తున్న ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కించాయి.
Ponniyin Selvan 2
Hi @Karthi_Offl @MadrasTalkies_ pic.twitter.com/THYy88NxIh
— Eka Lakhani (@ekalakhani) May 3, 2023