Kenishaa Francis | జయం రవితో కెనీషా బ్రేకప్?.. సోషల్ మీడియాకు గుడ్‌బై చెబుతూ పాప్ సింగర్ ఎమోషనల్ పోస్ట్
Kenishaa Francis | తమిళ స్టార్ హీరో జయం రవి, పాప్ సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌కు ముగింపు పడినట్లు తెలుస్తుంది.
Jayam Ravi | తమిళ స్టార్ హీరో జయం రవి, పాప్ సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ మధ్య ఉన్న రిలేషన్షిప్ ముగింపు పడినట్లు తెలుస్తుంది. జయం రవి తన భార్య ఆర్తితో విడాకులు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నప్పటి నుంచి, ఈ విడాకులకు కెనీషానే కారణమంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్, ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. గతంలో జయం రవి భార్య ఆర్తి కూడా తన విడాకుల వ్యవహారంలో మూడో వ్యక్తి ప్రమేయం ఉందంటూ పరోక్షంగా కెనీషాపై ఆరోపణలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలోనే కెనీషాకు సోషల్ మీడియాలో తీవ్రమైన వేధింపులు, చంపేస్తామనే హత్యా బెదిరింపులు కూడా వచ్చాయి.
అయితే, ఈ వివాదాలపై తాజాగా కెనీషా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక సుదీర్ఘమైన ఎమోషనల్ పోస్ట్ పెడుతూ, తాను ఈ వ్యవహారం నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ వివాదాలు, ట్రోలింగ్స్ వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, అందుకే చెన్నై నగరాన్ని సైతం వదిలి వెళ్లిపోతున్నట్లు ఆమె తెలిపారు. సినిమా పరిశ్రమకు, జయం రవిని సమర్థించే వారికి స్పందిస్తూ.. అతడు (రవి మోహన్) ఇక పూర్తిగా మీవాడేనని, దీనిపై తాను ఎలాంటి వివరణలు ఇవ్వలేనని, ఇకపై ఎలాంటి యుద్ధాలు చేయలేనని పేర్కొన్నారు. ఒక మంచి వ్యక్తికి అండగా నిలబడాలని అనుకోవడం తన అమాయకత్వమని, కానీ ఈ ప్రపంచం కేవలం అబద్ధాల కోరులతో నిండిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఇప్పటివరకు తాను తీసుకున్న బాధ్యతలన్నింటి నుండి వైదొలుగుతున్నానని, తనకెంతో ఇష్టమైన సంగీతాన్ని కూడా వదులుకుంటున్నట్లు చెప్తూ.. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను కూడా డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

