Iraivan | పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, 2 చిత్రాలతో ఇటీవల మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు తమిళ నటుడు జయం రవి (Jayam Ravi). ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ఇరైవన్ (Iraivan). నయనతార (Nayanathara) కథానాయికగా నటిస్తుంది. ఎండ్రెండ్రుం పున్నాగై (Endrendrum Punnagai), మనితన్ (Manithan), వామనన్ (Vamanan) చిత్రాల ఫేమ్ ఐ. అహ్మద్ (I.Ahmed) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు సంబంధించి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
ఇరైవన్ (Iraivan) సినిమాను తెలుగులో ‘గాడ్’ (God) పేరుతో డబ్ చేస్తున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
JayamRavi’s #Iraivan Telugu version titled as #GOD 👌
Trailer releasing today at 5.05PM💥 pic.twitter.com/Mq6SBvjoFl— AmuthaBharathi (@CinemaWithAB) September 25, 2023
పాషన్ స్టూడియోస్ బ్యానర్ (Passion Studios)పై సుధన్ సుందరం & జయరామ్ జి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సెప్టెంబర్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా (Yuvan Shanker Raaja) సంగీతం అందిస్తుండగా.. రాహుల్ బోస్, ఆశిష్ విద్యార్థి, నరేన్ తదితరలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.