Jayam Ravi | కెనీషాతో బ్రేకప్.. మీడియా ముందు జయం రవి కన్నీటి పర్యంతం!
Jayam Ravi | తమిళ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్) మీడియా ముందు కన్నీళ్లుపెట్టుకున్నాడు. అతడి ప్రియురాలు పాప్ సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ రవితో ఉన్న రిలేషన్‌షిప్‌కి బ్రేకప్ చెబుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
Jayam Ravi | తమిళ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్) మీడియా ముందు కన్నీళ్లుపెట్టుకున్నాడు. అతడి ప్రియురాలు పాప్ సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ రవితో ఉన్న రిలేషన్‌షిప్‌కి బ్రేకప్ చెబుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. జయం రవి తన భార్య ఆర్తితో విడాకులు ప్రకటించిన రోజు నుంచి, ఈ విడాకులకు కెనీషానే కారణమంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కెనీషాకు సోషల్ మీడియాలో తీవ్రమైన వేధింపులు, చంపేస్తామనే హత్యా బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ వివాదాలపై తాజాగా కెనీషా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక సుదీర్ఘమైన ఎమోషనల్ పోస్ట్ పెడుతూ, తాను ఈ వ్యవహారం నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ వివాదాలు, ట్రోలింగ్స్ వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, అందుకే చెన్నై నగరాన్ని సైతం వదిలి వెళ్లిపోతున్నట్లు ఆమె తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన నటుడు జయం రవి తీవ్ర ఆవేదనకు లోనై, కన్నీటి పర్యంతమయ్యారు.
జయం రవి మీడియా ముందు మాట్లాడుతూ.. ఒక ప్రముఖ నటి తన జీవితాన్ని నాశనం చేసిందని ఆరోపించిన ఆయన, గత 14 ఏళ్ల వైవాహిక జీవితంలో తాను ఒక బానిసలా బతికానని ఆవేదన చెందారు. తాను కష్టపడి సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తులన్నీ భార్య వైపు వాళ్లే ఉంచుకున్నారని, కనీసం తన పేరు మీద ఒక్క బ్యాంక్ అకౌంట్ కూడా లేకుండా చేశారని, ప్రస్తుతం తాను అద్దె ఇంట్లో ఉంటున్నానని తెలిపారు. ఇల్లు వదిలి వచ్చేటప్పుడు తన చేతిలో ఏమీ లేదని, తన డబ్బును తన ఇష్టప్రకారం ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ కూడా ఇవ్వలేదని చెప్పారు. సినిమాల్లో మహిళల హక్కుల గురించి మాట్లాడే తాను, మహిళలను ఎప్పుడూ తప్పుగా మాట్లాడనని, 45 ఏళ్ల వయసులో తాను అమ్మాయిల వెంట పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తనను అర్థం చేసుకుని తోడుగా నిలిచిన కెనీషాను కూడా టార్గెట్ చేసి పంపించేశారని మండిపడ్డారు. తన పిల్లల కోసమే తాను ఇన్నాళ్లూ బతికానని, కానీ ఇప్పుడు కనీసం తన పిల్లలను కూడా చూడనివ్వడం లేదని, వాళ్లను స్కూలుకు కూడా సెక్యూరిటీ గార్డుల కాపలాతో పంపుతున్నారని రవి మోహన్ తీవ్ర ఆక్రోశం వెళ్లగక్కారు.
నా పిల్లల భవిష్యత్తు కోసమే ఇన్నాళ్లూ నోరు మూసుకుని ఉన్నానని.. నా వ్యక్తిగత జీవితాన్ని సరిదిద్దుకున్నాకే మళ్లీ సినిమాల్లోకి వస్తానని, అంతవరకు తాను నటించనని రవి స్పష్టం చేశారు. చివరగా రవి మోహన్ మాట్లాడుతూ ‘మూడక్షరాల ఇడ్లీ నటి’ ఒకరు తన జీవితాన్ని నాశనం చేశారని, ఆమె ఎన్ని కుటుంబాలను కూల్చిందో తాను చెప్పాలా అని నిలదీశారు. తాను అనుకుంటే ఒకే రోజులో విడాకులు తీసుకునేవాడినని, కానీ తన పిల్లల కోసమే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, ఇకపై నన్ను రెచ్చగొట్టవద్దంటూ మండిపడ్డారు. రవి మోహన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతుండగా, ఆ ‘మూడక్షరాల నటి’ ఎవరనే దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది.
#Ravimohan‘s Emotional Pressmeet:
“My Films will not release on screens till i get my divorce.. I cannot act anymore.. I couldn’t bear the insult I got.. If you want to provoke me.. try it.. I worked for 23yrs.. 95% of my films are successful..” pic.twitter.com/mJsr4QRf2q
— Laxmi Kanth (@iammoviebuff007) May 16, 2026
Never Seen #Ravimohan this angry and emotional before..😳pic.twitter.com/02tYslDuIX
— Laxmi Kanth (@iammoviebuff007) May 16, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

