తిరుపతి నేపథ్య కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాకు అజయ్‌భూపతి దర్శకుడు. జూలై 9న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ఈ చిత్రంలోని ‘గుండె పేలిపోతుందే..’ అనే పాటను విడుదల చేశారు. తొలిప్రేమలోని మధురభావాలకు అద్దంపడుతూ, ప్రేమికుల అంతరంగాన్ని అందంగా ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది.
జీవీప్రకాష్కుమార్ స్వరపరచిన ఈ పాటను చంద్రబోస్ రచించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. దేవాలయం నేపథ్యంలో చిత్రీకరించిన విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్, నిర్మాణ సంస్థ: చందమామ కథలు, సమర్పణ: సి.అశ్వినీదత్, రచన-దర్శకత్వం: అజయ్ భూపతి.