Shah Rukh Khan | హిందీ నటులలో దక్షిణాది ప్రేక్షకులు అమితంగా అభిమానించేది షారుఖ్ ఖాన్నే. ఆయన సినిమా రిలీజవుతుందంటే ఇక్కడ కూడా పెద్ద పెద్ద బ్యానర్లు, ఈలలు, గోలలతో థియేటర్లు మార్మోగిపోతుంటాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో షారుఖ్ సినిమా రిలీజవుతుందంటే టాలీవుడ్ స్టార్ హీరో సినిమా రేంజ్లో సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితుడైన అట్లీతో జవాన్ చేస్తుండటంతో ఈ సినిమాపై వీర లెవల్లో అంచనాలున్నాయి. ఈ సినిమాతో కేవలం సౌత్‌లోనే షారుఖ్‌కు రెండొందల కోట్ల బొమ్మ అవుతుందనడంలో ఆశ్చర్యమే లేదు.
ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు గట్రా సినిమాపై ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేశాయి. అప్పుడే బాలీవుడ్ ట్రేడ్ షారుఖ్‌కు ఈ సినిమా మరో వెయ్యి కోట్ల బొమ్మవుతుందని అంచనా కూడా వేసేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్లో బిజినెస్ జరుగుతుందట. తెలుగులో ఈ సినిమా బిజినెస్ పాతికకోట్ల రేంజ్లో డీల్ సెట్ చేసుకుందట. షారుఖ్ సినిమాకు ఈ రేంజ్లో బిజినెస్ జరగడం ఇదే తొలిసారి. షారుఖ్ లాస్ట్ మూవీ పఠాన్ ఇక్కడ రూ.56 కోట్ల గ్రాస్ రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టింది. అంటే దాదాపు ముప్పై కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. కాగా తెలుగుతో పాటు హిందీ లాంగ్వెజ్ కలుపుకుని ఆ కలెక్షన్లు వచ్చాయి.
మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా పఠాన్ ఆ రేంజ్లో కలెక్షన్లు కొల్లగొడితే.. జవాన్‌కు కాస్త పాజిటీవ్ టాక్ వచ్చినా డబుల్ మార్జిన్‌తో హిట్టు కొట్టడం ఖాయం అని సినీ విశ్లేషకులు తెలుపుతున్నారు. పైగా అట్లీ సినిమాలకు కూడా ఇక్కడ పిచ్చ క్రేజ్ ఉంది. బిగిల్ వంటి ఫ్లాప్ సినిమానే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. ఇక ఇప్పుడు వీర లెవల్లో హైప్ ఉన్న జవాన్ రావడంతో వాళ్లు జాక్ పాక్ కొట్టినట్లే అని తెలుపుతున్నారు.
యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాను రెడ్ చిల్లీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తుంది. షారుఖ్‌కు జోడీగా నయనతార హీరోయిన్గా నటిస్తుంది. హిందీతో పాటు తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర పోషించాడు.