Jawan Movie Songs | మరో మూడు వారాల్లో రిలీజ్ కాబోతున్న జవాన్ పనులు ఒక్కోటి కొలిక్కి దశకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ల పనిలో పడిపోయింది. హిందీ సహా తమిళ, తెలుగు భాషల్లో పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను అట్లీ దర్శకత్వం వహించాడు. అప్పుడెప్పుడో రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్ నుంచి రీసెంట్గా రిలీజైన ఫస్ట్ సింగిల్ వరకు ప్రతీది సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుతూ వస్తున్నాయి. ఇక త్వరలోనే చెన్నైలో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ లెవల్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత తెలుగు, హిందీలో ప్రెస్ మీట్లు నిర్వహించేలా ప్లాన్ చేసుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెకండ్ సింగిల్ రిలీజైంది.
ఛలోనా అంటూ సాగిన ఈ మెలోడియస్ పాట బ్యూటిఫుల్‌గా ఉంది. అనిరుధ్ రవిచందర్ ట్యూన్ శ్రోతలను ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్లింది. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను ఆదిత్య ఆర్కే, ప్రియా మలి ఆలిపించారు. ఇప్పటికే రిలీజైన దుమ్మే దులిపేలా మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోక, తాజాగా రిలీజైన ఛలోనా సాంగ్ క్లాస్ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకునేలా ఉంది. విజువల్ పరంగా పాట మాత్రం హై స్టాండడ్స్లో ఉంది. ముఖ్యంగా ఫరాఖాన్ కొరియెగ్రఫి చాలా స్టైలిష్‌గా ఉంది. ఇక జవాన్ సినిమాపై పాటలతోనే కావాల్సినంత క్రేజ్ వచ్చేస్తుంది.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. షారుఖ్‌కు జోడీగా నయనతార నటించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనుంది. రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై గౌరీఖాన్ ఈ సినిమాను నిర్మించింది. ఇక ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులన్ని కలుపుకుని భారీ స్థాయిలో బిజినెస్ జరిగిదని, విడుదలకు ముందే సినిమాకు మూడొందల కోట్లు లాభాలు వచ్చాయని బాలీవుడ్ మీడియా టాక్.