సుధీర్‌బాబు, సోనాక్షిసిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకులు. భారతీయ పౌరాణిక ఇతివృత్తాల ఆధారంగా భారీ గ్రాఫిక్ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నవంబర్ 7న విడుదలకానుంది. విజయదశమి కానుకగా ఈ సినిమా నుంచి ధన పిశాచి పాటను విడుదల చేశారు.
సమీరా కొప్పికర్ కంపోజ్ చేసిన ఈ పాటను శ్రీహర్ష రచించారు. సాహితి చాగంటి ఆలపించారు. ఈ పాటలో బాలీవుడ్ అగ్ర నాయిక సోనాక్షిసిన్హా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కనబరచింది. దుష్టశక్తికి, దైవత్వానికి మధ్య జరిగిన పోరాటం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ఇందులో హీరో సుధీర్‌బాబు లోకరక్షకుడి పాత్రలో కనిపిస్తాడని, అతని విరోధిగా సోనాక్షిసిన్హా ప్రతినాయిక పాత్రను పోషిస్తున్నదని మేకర్స్ తెలిపారు. జీ స్టూడియోస్, ఎస్కేగీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.