Japan | తమిళంకు సమానంగా తెలుగులో క్రేజ్ దక్కించుకున్న నటుడు కార్తీ. ఆయన తన కెరీర్ బిగెనింగ్ నుంచే ఏకకాలంలో తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలను రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. తెలుగులో కార్తీ సినిమాలకు టాలీవుడ్ టైర్2 హీరో రేంజ్ కలెక్షన్లు వస్తుంటాయి. అంతేకాకుండా కార్తీ ఇక్కడ ఇంటర్వూలలో గాని, స్పీచ్‌లలో గాని తెలుగులో మాట్లాడటంతో టాలీవుడ్ ప్రేక్షకులలో మరింత అభిమానం సంపాదించుకున్నాడు. ఇక గతేడాది (సర్దార్, పొన్నియిన్ సెల్వన్, విరుమన్) హ్యట్రిక్ హిట్స్ సాధించిన కార్తీ.. ప్రస్తుతం అదే జోష్‌తో ‘జపాన్’ (Japan Movie) సినిమా చేస్తున్నాడు. రాజమురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్స్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమా టీజర్ నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ఈ చిత్రంలో కార్తీకి జోడీగా అనూ ఎమ్మాన్యుయేల్ నటిస్తుంది. ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ప్రభు నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దీపావళి సందర్బంగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించేశారు. కార్తీ స్టైలిష్‌గా ఇదివరకెన్నడూ కనిపించని లుక్‌లో పక్కా ఎంటర్టైన్ మెంట్ అందించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.
#JAPAN – Teaser – Today – 05:00 PM pic.twitter.com/B14yuiT31j
— Aakashavaani (@TheAakashavaani) October 18, 2023