కార్తీ ప్రధానపాత్రలో రూపొందుతున్న చిత్రం ‘జపాన్’. రాజు మురుగన్ దర్శకుడు. ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు కలిసి నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం దీపావళికి విడుదల కానుంది. ఈ సినిమాలో కార్తీ లుక్‌ని విడుదల చేశారు. ఒక చేత్తో గన్నీ, ఒక చేత్తో గ్లోబ్నీ పట్టుకొని ఫస్ట్‌లుక్‌లో వైరైటీగా కనిపిస్తున్నాడు కార్తీ. ఫస్ట్‌లుక్ మాదిరిగానే కథలో కూడా కొత్తదనం ఉంటుందని,త్వరలోనే టీజర్‌ని కూడా విడుదల చేయనున్నామని మేకర్స్ తెలిపారు. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.