Jani Master | లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మళ్లీ సినిమా షూటింగ్‌ల్లో జాయిన్ అవ్వబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తన డాన్స్ అకాడమీలో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై స్పందించాడు.
అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం నాకు తెలియగానే నాకు గుర్తోచ్చిన మొదటి విషయం ఆయన పిల్లలు. ఎందుకంటే అల్లు అర్జున్ పిల్లలు నాకు తెలుసు. షూటింగ్లో వస్తారు అల్లరి చేస్తారు. కానీ వాళ్ల తండ్రి అరెస్ట్ అవ్వగానే వాళ్లు ఎలా ఉంటారో అని ఆలోచించాను. నేను కూడా జైలుకు వెళ్లినప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్లు ఏం అయిపోతారో అని కంగారుపడ్డాను అంటూ జానీ మాస్టర్ చెప్పుకోచ్చాడు.
Choreographer Jani Master About #AlluArjun Arrest ! pic.twitter.com/HlZVNukzfz
— Telugu Chitraalu (@TeluguChitraalu) January 1, 2025