అతిలోక సుందరి అనే పదానికి అసలైన నిర్వచనంలా ఉంటూ ఎన్నో ఏళ్ల పాటు సినీ వినీలాకాశంలో ఓ వెలుగు వెలిగిన ధృవతార శ్రీదేవి. దక్షిణాదిలోని అన్ని భాషల్లో తన హవాను చూపించిన శ్రీదేవి.. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టారు. అక్కడ కూడా స్టార్ హీరోలతో కలిసి నటించారు. ఈ క్రమంలోనే శ్రీదేవి లవ్ ట్రాకుల గురించి ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్‌ను పెళ్లాడిన ఆమె జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ అనే ఇద్దరు అమ్మాయిలకి జన్మనిచ్చింది.
కూతుళ్లని కూడా హీరోయిన్స్‌గా చూడాలని శ్రీదేవి ఎంతో కలలు కన్నది. పెద్ద కూతురు జాన్వీ ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరకి దఢఖ్ సినిమాతో జాన్వీని పరిచయం చేసింది. అయితే ఆమె సినిమాను వెండితెరపై చూసే అవకాశం శ్రీదేవికి దక్కలేదు.అయితే తల్లి అందం,అభినయాన్ని పుణికి పుచ్చుకున్న జాన్వీ సినిమాలతోను, ఫొటోషూట్స్తోను అభిమానులని ఎంతగానో అలరిస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో జాన్వీ చేసే ఫొటో షూట్స్ నెటిజన్స్‌కి పిచ్చెక్కిస్తున్నాయి. నాన్‌స్టాప్‌గా ఈ అమ్మడు అందాలు ఆరబోస్తూ ఫొటో షూట్స్ చేస్తుంది. తాజాగా రెడ్ లెహంగాలో క్లీవేజ్ షో చేస్తూ ఓర చూపులు చూస్తుంది. జాన్వీ మెరుపులకు ప్రేక్షకులకు మైమరచిపోతున్నారు.