Janhvi Kapoor at Wimbledon 2025 | బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి వింబుల్డన్ 2025 సెమీ-ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించారు. జూలై 11న లండన్‌లోని ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ అండ్ క్రోకెట్ క్లబ్లో జరిగిన ఈ మ్యాచ్‌కు వీరిద్దరూ హాజరయ్యారు. స్టైలిష్ దుస్తుల్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.
జాన్వీ కపూర్ చెకర్డ్ డ్రెస్సులో, శిఖర్ పహారియా బ్లూ సూట్లో కనిపించారు. వీరిద్దరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాన్వీ కపూర్, శిఖర్ పహారియా తమ బంధాన్ని ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించనప్పటికీ, వీరి పబ్లిక్ అప్పియరెన్స్ వారి రిలేషన్‌షిప్‌పై చర్చకు దారి తీస్తున్నాయి. సినిమాల విషయానికొస్తే, జాన్వీ ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి ‘పెద్ది’ చిత్రంలో నటిస్తోంది. అలాగే హిందీలో ‘సన్నీ సంస్కారి కి తులసి కుమార్’, ‘పరమ్ సుందరి’ వంటి చిత్రాల్లో కూడా నటిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి పెద్ది చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు హోమ్‌బౌండ్, సన్నీ సంస్కారి కి తులసి కుమారి, పరమ్ సుందరి లాంటి బాలీవుడ్ సినిమాల్లో కనిపించనుంది.
Janhvi Kapoor at Wimbledon 2025 😎🎾#Janhvi #JanhviKapoor pic.twitter.com/jfu67ntBLP
— WV – Media (@wvmediaa) July 11, 2025