‘జంధ్యాలగారి జాతర 2.0’ పేరుతో ఓ చిత్రం రూపొందుతున్నది. క్రిష్, కష్వీ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. సన్ స్టూడియో నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాల్మీకి దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. ‘ ఇది కామెడీ సినిమా అని టైటిలే చెబుతుంది. నాకుమార్తె శ్రీలు ఇందులో నటించడం ఆనందంగా ఉంది’ అని కామెడీ నటుడు పృధ్వీ చెప్పారు.
‘జంధ్యాలగారి పేరిట వస్తున్న ఈ సినిమా ఆయన పేరు నిలబెట్టేలా ఉంటుందని దర్శకుడు చెప్పారు. బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రఘుబాబు, సత్య, అజయ్‌ఘోష్, రాజీవ్‌కనకాల, ప్రిన్స్, నాగినీడు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విజయ్ ఠాగూర్, సంగీతం: వంశీకృష్ణ, సమర్పణ: శ్రీనిధి క్రియేషన్స్.