ఉభయ తెలుగు రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో ‘జనక అయితే గనక’ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఈ నెల 7న విడుదల కావాల్సి ఉంది. రెండు రాష్ర్టాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని దిల్‌రాజు పేర్కొన్నారు. సుహాస్, సంగీర్తన జంటగా నటించిన ‘జనక అయితే గనక’ చిత్రానికి సందీప్‌రెడ్డి బండ్ల దర్శకత్వం వహించారు. దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. వినోదాత్మక కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.