Hari Hara Veera Mallu | అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమాకు జాగర్లమూడి క్రిష్‌తో పాటు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. హిస్టారికల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం ప్రీమియర్స్ నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మూవీ చూసిన ప్రేక్షకులు ఈ సినిమా ఏంటి ఇంత దారుణంగా ఉందని.. గ్రాఫిక్స్ మరి ట్రోల్ చేసేలా ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా చూసిన ఒక జనసైనికుడు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. సివిల్స్, గ్రూప్స్ వంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్లు హరిహర వీరమల్లు సినిమా చూడాలని.. ఈ సినిమా చూస్తే.. ఇందులో నుంచి 10 మార్కుల ప్రశ్నలు వస్తాయని అభిమాని చెప్పుకోచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు శుభవార్త
నిరుద్యోగులు అందరూ హరిహర వీర మల్లు సినిమా చూడండి..ఈ సినిమా నుండి పోటీ పరీక్షల్లో 10 మార్కుల ప్రశ్నలు వస్తాయి pic.twitter.com/ABL6sAB0he
— Telugu Scribe (@TeluguScribe) July 24, 2025